పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0198-5 లలిత సంపుటం: 07-583

పల్లవి:
ఏమిటికాసపడేవు యెందుకైనాను
సాముసేసినట్టి నీతో సాటివచ్చేమా

చ.1:
తచ్చి చూడ నీకునిది దట్టిగట్టు నౌానేమో
పచ్చనాకు మాకొంగు పట్టివు నీవు
యిచ్చ మాకాకిపైఁడిబొట్టేమి చూచేవింతలోనే
బచ్చెన నీపైఁడిచీర పాటిదయ్యీనా

చ.2:
యెంచుకో నీ సామ్ములలో యిది దాఁచవచ్చునేమో
పంచెపు మాగురిగింజపేరడిగేవు
దించనట్టి మావింటిదిక్కేమి చూచేవు
సంచపు నీ చుట్టుఁగత్తి సరివచ్చీనా

చ.3:
యిప్పుడే తెలుసుకో నీకిది గూడయ్యీనేమో
నెప్పున మామోవితేనె నీవు గోరేవు
ముప్పిరి శ్రీ వెంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
యెప్పుడూనురముకాంత కెనవచ్చీ నా