పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0198-4 సామంతం సంపుటం: 07-582

పల్లవి:
కొలమునొకటిగాదు గుణమునొకటిగాదు
శెలిమి శేయవచ్చీని శెనకకుమనవే

చ.1:
యిల్లిదివో మమ్ము సూడు యేనుగవంటి నడపు
సల్లని తేటసూపులే సక్కదనాలు
సెల్లఁబో సూడుమనవే శింయ్యమువంటి నడుము
గొల్లనికి శెంచెతకు కూటము సెల్లునా

చ.2:
నిచ్చలు మాసెంపలపై నెమిలివంటిది కొప్పు
పచ్చులవంటివి మాబలు సన్నులు
కుచ్చుల పారిటాకులు గిరిగింజ సరుములు
అచ్చపుటూరవాఁడు మాయడవినుండీనా

చ.3:
వసుముగాని శిలుకవంటిదివో మామాట
పసని తేనెల మోవి పశిమివొల్లు
యెసగ శ్రీ వెంకటేశుఁడేటవెట్టి నన్నుఁగూడె
రసికుఁడు దాను నేను రాశిపాటదాననే