పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0198-3 నాదరామక్రియ సంపుటం; 07-581

పల్లవి:
మరిఁగించ మరి లేవా మాటలు మాపుదాఁక
పారుగు పొంతల నీకుఁ బొద్దు వోదా

చ.1:
వంచనతో నీవు నాకు వలచినవలపెల్ల
కంచపుమోవియందేా కానవచ్చెను
చంచులనిందరిలోన సతమేమి నెరపేవు
పొంచి పొంచి నీకదేమి పొద్దువోదా

చ.2:
తలఁచిన నీలోని తలపోఁతలెల్లాను
పిలిచిన పిలుపులోఁ బెనగొనెను
మలశి యెప్పటినెడమాటలేమాడించేవు
పులిమేవు నవ్వులేమి పొద్దువోదా

చ.3:
జాడల నీ నా సంది సరసములెల్లాను
కూడినకూటమిలోనే గురులాయను
యీడనె శ్రీ వెంకటేశ యెంతకెంత సేసేవు
ప్రోడవౌదువు నీకింకఁ బొద్దువోదా