పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0198-2 వరాళి సంపుటం: 07-580

పల్లవి:
పట్టిన చలములేలే పైపైనాతనితోడ
వొట్టుక పంతమిప్పించె వువిదచేఁ జాలదా

చ.1:
వెంగెము లాడకువే విభుఁడు నీసవతైన
అంగననీడకుఁ దెచ్చె నదిచాలదా
కంగువెట్టుకోకువే కమ్మనిపూవులచెండు
కుంగరాల వేళ్ళచేత నొగ్గింపించెఁ జాలదా

చ.2:
చలము సాదించకువే సవతిని నాయకుఁడు
అలరి నీచేతి కిచ్చె నదిచాలదా
బలిమి సేయకువె ప్రాణేశ్వరుఁడు ఆపెఁ
గొలువులోఁ బెట్టి నినుఁ గొసరించెఁ జాలదా

చ.3:
చేపట్టి బిగియకువే శ్రీ వెంకటేశుఁడు నిన్ను
ఆపెచేతఁ బొగడించె నదిచాలదా
రాఁపులిఁకఁ జేయకువే రతికేలిలోపలను
మోపుగట్టించె వలపు ముదితచేఁ జాలదా