పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0198-1 శంకరాభరణం సంపుటం: 07-579

పల్లవి:
చెప్పఁగనేఁటికి చెలి మనతోడ
కప్పెఁ జింతలవె కానఁగరాదా

చ.1:
తలఁపులోపలి తమకమెల్లాను
సెలవినవ్వులఁ జిందీఁ గదే
కొలఁది మీరిన కోరికలప్పటి
మొలకపులక మొత్తములాయ

చ.2:
వినుకలి తన విరహమెల్లాను
కనుఁగొనలనే కమ్మీఁ గదే
చనవుల తన సరసమప్పటి
ననుపుమాటల నటనలాయ

చ.3:
గక్కనఁ గూడిన కందువలెల్లాను
మిక్కిలి మోవిపై మించెఁ గదే
యెక్కువ శ్రీ వేంకటేశు మేలప్పటి
వొక్కటై పాయని వొద్దికలాయ