పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0139-5 రామక్రియ సంపుటం; 07-578

పల్లవి:
మండాటమింతటిమీఁద మరిలేదు
అండనుండేవారమింతే అదివో నీచిత్తము

చ.1:
పంతానకెక్కినమాట పాయానకెక్కినమాట
కాంత నీతోనాడినది కలదొక్కటే
చింతలోని దాఁపిరయు సేయఁగల కాఁపిరము
వింతలుగ నేముసేసే విన్నపములోనివే

చ.2:
కందువనెలల వాఁత కమ్మలలోపలి వాఁత
యిందుముఖి నీసందికిది యొక్కటే
యిందమన్న కానికలు యెంచుకొన్న పూనికలు
ముందు నీకిందరము మొక్కిన మొక్కులవే

చ.3:
కనుఁగొన్నట్టి వేడుక కాఁగిటిలోని వేడుక
పనివడి సతిభాగ్యఫలమొక్కటే
ననిచె శ్రీవెంకటేశ నయములుఁ బ్రియములు
చనవు మెరసిన మా సమ్మతాలలోనివే