పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0110-3 రామక్రియ సంపుటం: 07-057

పల్లవి:
ఎంతచెప్పినా నెఱఁగవేలే చలము
పంతగాఁడు నేఁడువాని పనులెల్లా దక్కెను

చ.1:
ఆతఁడు నీతో మాటలాడఁడంటా నిలుచుంటే
యేతులకే పాటవాడేవేమే చలము
కాతరించి యాఁటదింత కక్కూరితిపడితేను
చేతులార మగవాఁడు చేసినట్టే చెల్లదా

చ.2:
చుట్టి చుట్టాతఁడు నన్నుఁ జాడవీలెనంటానే
యిట్టే జోలి మొక్కు మొక్కేవేలే చలము
గుట్టు తోడి మగువలు కోరి తామె పైకొంటే
బెట్టుగాఁ దన విభుఁడు బిగియక మానఁడు

చ.3:
పై పై శ్రీ వేంకటేశుఁడు పరాక్టై వున్నాఁడంటే
యేపు మీఱి నవ్వు నవ్వేవేలే చలము
రాఁపుగాని యాఁటదింత రతికిఁ బెనఁగితేను
యీపాద్దాతఁడిట్టె కూడె నెదురాడఁగలనా