పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0197-4 గుండక్రియ సంపుటం: 07-576

పల్లవి:
పడఁతిరో నీవేల బత్తి గొట్టానఁ బెట్టేవే భూమి
పాడమి సతులతల పూరిగట్టునేఁటికే

చ.1:
పుట్టిపడఁ దేనెలెంత వూరిపడ మాటాడిన
మట్టులేక భ్రమసీనా మగవాఁడు
చుట్టురికాలెంత సూటిపడఁ జెప్పినాను
కట్టుకొనునా మెడఁ గమ్మర నిన్నతఁడు

చ.2:
కన్నుసన్నల నీవెంత కప్పురాలు చల్లినాను
యెన్నికలేక మెచ్చీనా యింతవాఁడు
పన్ని నీమచ్చికచూపి పాదాలెంత పిసికినా
చెన్నుమీర నన్ను నరచేతఁబెట్టుకుండునా

చ.3:
సిగ్గువడకాతనిపై చేతులెంత చాఁచినాను
వెగ్గళించుమనీనా శ్రీ వెంకటేశుఁడు
అగ్గమై నన్నిటుగూడెనట్టి నీవూఁ గొసరితే
నిగ్గులపూజగా నిన్ను నెత్తిఁ బెట్టుకొనునా