పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0197-3 సాళంగనాట సంపుటం: 07-575

పల్లవి:
వచ్చినవారమిదివో వాకిటనె వున్నారము
నెచ్చెలి యెదురుచూచీ నీచిత్తమిఁకను

చ.1:
నవ్వుల పండుగలాయ ననుపులెండుగలాయ
యివ్వల చెలితో పొందులిఁకనెన్నఁడు
రవ్వలాయ నీచేఁతలు రాజసమే నెరపఁగా
దివ్వెలెత్తుఁబొద్దులకు తిరమాయఁ బనులు

చ.2:
మాటలివే విందులాయ మంతనాలే సందులాయ
యీటున కాంతతో మేలమిఁకనెన్నఁడు
మూటలాయ నేర్చులు మోచుకవున్నారమిదే
మేటిశింగారాల వేగీ మిగిలె చీఁకట్లు

చ.3:
వీడెములే వొడినిండె వేడుకలు పంటవండె
యీడ వచ్చున్నది చెలియ యిఁకనెన్నఁడు
పాడితో శ్రీ వెంకటేశ పడఁతిఁ గూడితివిట్టె
యేడుమద్యాన్నములెక్కె యెట్టి రహస్యములో