పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0197-2 కన్నడగౌళ సంపుటం: 07-574

పల్లవి:
కానుక నీకిచ్చితిమి కాచుకున్నారము నేము
ఆనేరుపులిఁకమీఁద నడుగము

చ.1:
వేవేలు చెలిభావాలు విన్నవించితిమి నేఁడు
దేవరచిత్తమెట్టో తెలియదు
చేవమీరె విరహము చెమరించెనింతిమేను
యేవేళఁ గరుణించేవో యెరఁగము

చ.2:
పచ్చిదోఁచెనాకెమేలు పైకొని నీవే ఆడకు
విచ్చేసినయందాఁక వేగిరించము
నిచ్చలు నీచేఁతలెట్టో నీవేగతి మరిలేరు
చెచ్చెరనేమి సేసేవో చిమ్మిరేఁచము

చ.3:
కన్నులెదుట నిద్దరిఁ గదియించితిమి నేఁడు
మన్నించితివింతికిఁగా మండాడము
యెన్నికెఁ శ్రీ వెంకటేశ యీపె నీవునొక్కటే
మిన్నకయైనా సారె మెచ్చకిట్టే మానము