పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0196-4 లలిత సంపుటం: 07-570

పల్లవి:
మొగదాకిరివాఁడవు మొదలే నీవు
తెగనాడవేమిటికి దేవరవు నీవు

చ.1:
చెప్పినట్టు సేతునంటే చెలఁగి మందెమేళాన
యెప్పుడైనా విన్నవింతునేమైనను
యిప్పుడిట్టే పదారువేలేకతాలకారు నీకు
వొప్పి యెవ్వరిమాటలు వూకొనేవు నీవు

చ.2:
చేతిలోని వాఁడవంటాఁ జిక్కించుక కాతరాన
యీతల నాతలఁ దీతునేడకైనను
ఆతుమ నీకుఁ బాయరానట్టివారు యెనమండ్రు
యేతుల నెవ్వరిచన వియ్యకొనేవు నీవు

చ.3:
కూడినట్టే కూడేవని గుఱిగా శ్రీ వెంకటేశ
యీడులేక పెనఁగితినిందాఁకాను
వాడికె గొల్లెతలైతే వలసినందరు నీకు
మేడేన నెవ్వరిపాందు మెచ్చేవు నీవు