పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0196-1 రామక్రియ సంపుటం: 07-567

పల్లవి:
మఱి యేమి యెఱఁగను మాటలు నేను
నెఱవైన యట్టి దిక్కు నీవే నాకు

చ.1:
తపము చేసినదాన తగులనాడినదాన
నెపము సేసినదాన నేనే నీకు
రపమయ్యేవాఁడవు రక్షించేవాఁడవు
నిపుణుఁడ విన్నిటాను నీవే నాకు

చ.2:
పట్టి కొలిచినదాన పనులు చేసినదాన
నెట్టన నీదయవల్ల నేనే నీకు
జల్టగొన్నవాఁడవు చనవిచ్చినవాఁడవు
నెట్టెపు మోహపుగురి నీవే నాకు

చ.3:
గక్కనఁ జూచినదాన కాఁగిటఁ గూడినదాన
నెక్కొని తొలుదొలుత నేనే నీకు
యెక్కువ శ్రీ వెంకటేశ యేలుకొన్నవాఁడవు
నిక్కెమిన్నిపనులందు నీవే నాకు