పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0195-2 పాడి సంపుటం; 07-562

పల్లవి:
తనకు నాకు నెప్పుడు తగులేకదే
మనసు మర్మములకు మంచిదే కదే

చ.1:
మొక్కలాన నటు చనుమొనలు నే మోపితేను
వెక్కసీఁడు తనకింక వెరుపేఁటికే
జక్కవ పిట్టిలు నావి జవ్వన వనమె తాను
యెక్కఢపోవును వాని కిరవే కదే

చ.2:
సంతొసపుఁ జూపులచక్కెర నేఁజల్లితేను
పంతగాఁడు తానేల భ్రమసీనే
కంతువిండ్లు నా బొమలు గవిశన తనమేను
పాంతనెంచి చూచుకొంటే పాందులేకదే

చ.3:
బలిమి కాఁగిటఁ దనపైఁ జేతులు వేసితేను
యెలమి శ్రీవెంకటేశుఁడేల నవ్వీనే
జలజములీవి నావి సరవిఁ బూజు తనది
నిలుకడలకు నివి నిజమే కదే