పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-6 లలిత సంపుటం: 07-560

పల్లవి:
ఇటువంటివే నీకు యితవులౌను
కుటిలకుంతలిచేఁత గురియాయ నీకు

చ.1:
చెలియ నీయెదుటను చేతులెత్తి మొక్కితేను
మొలక చన్నులు నీపై మొనలెత్తెను
అలరి చంకగుదియ నట్టే శరణనేటి
నిలుకడయిన మాట నిజమాయ నీకు

చ.2:
కోమలి నీవూడిగేన కుంచె విసరఁ జొచ్చితే
దామెనహారాలు వల్లెతగిలించెను
వేమూరు నోమేది నోము వేసేవి గాలాలు
యీమాటలెల్ల నేఁ డు యిరవాయ నీకు

చ.3:
కందువ శ్రీవెంకటేశ కాఁగిట నిన్ను నించితే
యిందుముఖి మోవి నిన్ను నెంగిలిసేసె
విందులలోనే మరి వీడుదోడుగూడినట్టి
అందమైన మాటలెల్ల ననువాయ నీకు