పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0194-4 నాట సంపుటం: 07-558

పల్లవి:
ఆడినట్టే యాడరాదు ఆపెతో నీవు
వాడికెసరసములే వైపులింతే కొని

చ.1:
కోమలి తోడుత నీకుఁ గోపగించుకొనరాదు
యేమేమి మాటలాడినా నెంతదూరినా
కామించి వచ్చినదాపె కైకొని గురియైతివి
దామెన నీనగవులే తగవింతే కాని

చ.2:
అట్టి చలపట్టరాదు అంగనయడకు నీవు
ఱట్టు నిన్నెంతసేసి యాఱడిఁ బెట్టినా
చుట్టపు వరుస దాపె చొక్కి చనవిచ్చితివి
నిట్ట చూపుల మెచ్చులే నేరుపులు గాని

చ.3:
జొడువాయనిఁకరాదు సుదతి యింటను నీవు
యీడు యెంత మీరినాను యెలయించునా
వేడుకకతై యాపె శ్రీవేంకటేశుఁడవు నీవు
కూడిన యీకూటములే గుణములు గాని