పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0110-1 సామంతం సంపుటం: 07-055

పల్లవి:
ఇట్టె నిన్ను రమ్మనె నేమమ్మ
నెట్టుకొన్న తమమెలు నేఁజూడవలెనా

చ.1:
కప్పురమింద కోవమ్మ కాంతుఁడు నీకుఁ బెట్టెంపె
అప్పుడే పెండ్లి దననాయనటరే
ముప్పిరి పువ్వులు నీకు ముడుచుకోనంపెనమ్మ
చెప్పరే యాపెయుఁ దానుఁ జేకొని మిగిలెనా

చ.2:
గందము నీకుఁబెట్టెంపెఁ గైకొనఁ గదవమ్మ
అందుతోనే సోబనపుటక్షఁతలివా
చందనకాపులు నీకు సరిగట్టునంపెనమ్మ
యిందు నాగవెల్లికట్నాలింతలోనే వచ్చెనా

చ.3:
పై పై నీకిదివో పల్లకి వెట్టెంపె నమ్మ
యీపొద్దే తమకు నేఁడేఁగుఁబెండ్లా
చేపట్టి నిన్నిదె కూడె శ్రీ వేంకటేశుఁడోయమ్మ
కోపులఁ దోడఁబెండ్లికూఁతురనా నేను