పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0194-3 దేసాక్షి సంపుటం: 07-557

పల్లవి:
మాపుదాఁకా జోలి మరి యేఁటికి
కోపుల మీరెను కొసరులు

చ.1:
సరివచ్చె నేఁడు సతికి నీకును
సిరుల నవ్వుల సెలవులు
పారుగుకు వచ్చె పొద్దున మీకిదె
గరగరికెల కరఁగులు

చ.2:
చొప్పణంగె నేఁడు సుదతికి నీకు
తప్పక చూచేవి తడవులు
ముప్పీరి గొనెను మోహము లోననే
కొప్పులు జారి గురుతులు

చ.3:
తగవులఁ బెట్టీ తరుణికి నీకు
బిగువు కాఁగిటి పెనఁగులు
జిగిఁ గూడితిరి శ్రీ వెంకటేశుఁడ
తగులాయ మీతలఁపులు