పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-5 హిజ్జెజి సంపుటం; 07-553

పల్లవి:
అప్పటినుండియు విభుఁడట్టె తప్పక చూచీ
యిప్పుడిట్టె రాఁగదవె యియ్యకొన్నదానవు

చ.1:
చిత్తము పతికినిచ్చి సిగ్గులువడఁగనేలె
పొత్తుకు రమ్మనీ వలపుల నాతఁడు
కొత్తగా బొందుసేసేవా కొంగువట్టి తీసితేను
వుత్తరువేమి చెప్పవే వూరకున్నదానవు

చ.2:
యింటిలోననే వుండి యింకా మరఁగులేలే
అంటి పానుపుపైకి రమ్మనీ నాతఁడు
జంటలు నేఁడాయనా సత్తువలఁ బెనఁగితే
వొంటి నట్టే వుండఁగదే వొాడఁబడ్డదానవు

చ.3:
కలసి కాఁగిటఁ గూడి కన్నుల జంకెనలేలే
యెలయించీ శ్రీ వేంకటేశుఁడాతఁడు
చలములు యిఁకఁగద్డా చన్నులుగోరనొత్తితే
కొలఁదెరిఁగి నవ్వవే గుట్టుగలదానవు