పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-4 నాదరామక్రియ సంపుటం: 07-552

చ.1:
ఇంతకంటే నేరము యెపుడు నీవారము
వంతుల మాచన్నులకు వాఁడి వచ్చెనిపుడు

చ.1:
జగడించేవారికెల్లా సారెసారె వెంగెములు
తగులై నవారికైతే తమకములు
మొగమేమి చూచేవు మొరఁగులు మరఁగులు
చిగురుమోవిమాట చేఁగలెక్కెనిపుడు

చ.2:
అలిగినవారికెల్లా అసురులు నుసురులు
కలసినవారికైతే కడుమేలాలు
వలుపేమి లోఁచేవు వలరాజుబాణాలైన
తెలిఁగన్నుల చూపులు తేటలెక్కె నిపుడు

చ.3:
పెనఁగేటి వారికెల్లా పెచ్చురేఁగుఁ జెమటలు
తనిసినవారికైతే దగదొట్టును
మనసేమి దెలిసేవు మచ్చిక శ్రీ వెంకటేశ
యెనసితిమి యాసలు యెదురెక్కెనిపుడు