పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-11 కేదారగౌళ సంపుటం: 07-549

పల్లవి:
వొడఁబరచఁగనేలే వొద్దే యిఁక
కడునైతే చవిగాదూో కానరాదా మీకు

చ.1:
చలము లేకున్నఁ జాలుసంతోసమే పనులెల్ల
చెలిమికత్తెలు మీరు చెప్పరే బుద్ధి
తలఁపు లేశములైతే తనమాటె నామాట
తెలుసునో తెలియదో దిష్టిములిందరికి

చ.2:
వేసట లేకున్నఁ జాలు వేడుకలే పొందులెల్ల
గాసిఁబెట్టి యింకనట్టే కానీ లేరే
ఆసలు గలిగితే అన్నిటాఁ దానే నేను
యీసుగద్దొలేదొ మీరె యెంచుకొరే యిందును

చ.3:
యెఱుక గలిగితేఁ జాలు యియ్యకోరె వలపెల్ల
మఱఁగులు వాపితిరి మంచిదాయనే
మఱి శ్రీ వెంకటేశుఁడు మన్నించి యిటు గూడె
గుఱిగా మీమనసులఁ గోరినట్టే ఆయనే