పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0192-6 కాంభోది సంపుటం: 07-548

పల్లవి:
మంకులెల్లఁ బనిలేదే మాపుదాఁకాన
యింకాఁ దనకే మోహించేనేమిసేతునే

చ.1:
ఆడఁబోతే మాటలలో ఆతఁడే తొరలి వచ్చీ
చూడఁబోతే గురియై చూపులలోన
వేడుకకాఁడు గనక విభునికింతాఁ జెల్లు
యేడఁ జూచినాఁ దానే యేమిసేతునే

చ.2:
సారెకు నవ్వఁగఁబోతే సరసమాతని మోచీ
నేరఁబోతే తనచేఁతే నిండుకొనీని
పేరుకల దొర తాను ప్రియమైనట్టు నడచు
యేరులాయ గోరికొన యేమిసేతునే

చ.3:
చేతికొనవట్టితేనే శ్రీ వెంకటేశుఁడే వచ్చి
కాతరించితే రతులఁ గలనె నేఁడు
పోతరించున్నాఁడు తాను పొందులుసేసినవెల్లా
యేతులునెమ్మెలునాయనేమిసేతునే