పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రెకు: 0109-6 సామంతం సంపుటం: 07-054

పల్లవి:
ఇంతట విచ్చేయవయ్యా యింతి విలిచీనిదివో
ఎంతలేదిదెంచుకొంటే నిద్దరునూనొక్కటే

చ.1:
జవ్వన గర్వముతోడి సతులు దమకోపాన
రవ్వలుగానాడుదురు రమణులను
నవ్వులు సేసుకొనక నాతులతో జగడించి
పువ్వుమొన వాఁడిసేసే పురుషుడూఁ గలఁడా

చ.2:
సరసమాడేటి వేళ సతులట్టే చనవున
సిరులతో వెగ్గళించి చేయి ముంతురు
సరుస గురుతు మా యించకీకెను రట్టు సేసి
బిరుగాలి ముడిగట్టే ప్రియుఁడూఁ గలఁడా

చ.3:
రానీ పోనీ తమకాన రామలు తమచూపుల
సానలఁ బట్టుచుఁ బగ చాటుదురు
దీనికే శ్రీ వేంకటేశ తెఱవం గూడితివిట్టె
మైనము సూలము సేసే మగవాఁడూఁ గలఁడా