పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0192-5 భైరవి సంపుటం: 07-547

పల్లవి:
ఆనతియ్యవయ్యా నీయప్పణ గావలె నాకు
కానుకింద నిమ్మపండు కందువయేదిఁకను

చ.1:
చనవుగలాపె నీసంగడిఁ గూచున్నది
మనవిగలాపె నీతో మాట చెప్పని
ననుపుగలాపె సారె నవ్వులు నవ్వీనిడె
వొసర నేఁజేసేటి వూడిగమేదిఁకను

చ.2:
పంతము గలాపె నీతో పలుమారు బింకమాడీ
చింత గలిగగినయాపె చేయి చాఁచీని
వంతు గలిగినయాపె వరుసకు వచ్చున్నది
బంతినున్నదాన నాకుఁ బనియేదిఁకను

చ.3:
వాసిగల్గినయాపె వన్నెతో మొగము చూవీ
ఆసగలిగినయాపె ఆయాలంటీని
యీసరినే శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
నేస చల్లితివి నాకు సేవ యేఁటిదిఁకను