పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0192-3 శ్రీరాగం సంపుటం: 07-545

పల్లవి:
అందరిలో నీవౌఁగదవే
అందితివి పదవులౌఁగదవే

చ.1:
చతురతఁ దెరలోసందించినవా
రతఁడును నీవును నౌఁగదవే
కతలు చెప్పుతా గయ్యాళిఁచితి
వతివెవు నీవే యౌఁగదవే

చ.2:
తప్పక యింటిలోఁ దమ్ములముమిసితి
రప్పసము మీరె యౌఁగదవే
ముప్పిరి నగితివి మునుపన యేఁటికొ
అప్పడు నీవే యౌఁగదవే

చ.3:
మక్కువ ననునిటు మన్నింపించితి
వక్కరొ నీవే యౌఁగదవే
వెక్కసముగ శ్రీ వెంకటేశ్వరుని
యక్కున నిలిచితి వవుగదవే