పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0192-2 ముఖారి సంపుటం: 07-544

పల్లవి:
వెరవు విచారించుకొంటే వేగిరించేవు
యెరవేది యిందునాపె యేమిసేసునయ్యా

చ.1:
జగడములెల్లాఁ దీరె సరసములాడితేను
నగితే కోపములేదు ననుపాయను
వెగటుఁగాఁతాళాలు వీడెను విడెమిచ్చితే
యెగసక్యమేది యింతి యేమిసేసునయ్యా

చ.2:
మఱఁగులెల్లాఁబాసె మాట్టపలుకాడితేను
మఱచితేఁబగలేదు మనసిచ్చెను
కొఱకొఱలెల్లఁ దీరె కొచ్చికొచ్చిచూచితేను
యెఱఁగనిదేది యింతి యేమిసేసునయ్యా

చ.3:
మచ్చరమింతా మానె మరి వద్దఁ గూచుండితే
లచ్చనంటితేఁ గొంకదు లాగాయను
పచ్చిదేరే శ్రీవెంకటపతినాపె గలసితే
యెచ్చుకుందులేవి యింతి యేమిసేసునయ్యా