పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0191-6 ముఖారి సంపుటం: 07-542

పల్లవి:
ఇప్పటి కక్యూరితికినెంత సేసీనే
కప్పుక వున్నారందరు కాఁతాళించరా

చ.1:
యేమిటికిఁ దారుకాణలెరిఁగిన పనులకు
కామించి తానెరఁగని కల్లలున్నవా
వాములై పెండ్లికూఁతుర్లు వద్దనే కాచుకున్నారు
వోముచుఁ దానిట్లంటే వోరుతురా వారు

చ.2:
అంతేసేలే ఆనలందరికిఁ గలదే
చెంతలఁ దాఁచేయనిచేఁతలాడేరా
కాంతలిందరును నిదే కనుపెట్టుకున్నవారు
యింతకుఁ దాఁజొచ్చితేను యెగ్గుపట్టరా

చ.3:
కమ్మటిఁ బెనఁగనేలే కాఁగిటఁ గూడితిమిదే
యెమ్మెతో శ్రీ వెంకటేశుఁడిఁక మానీనా
పమ్మి తనమేలువారు ఫైపైనే వున్నారు
నమ్మించినయందుకెల్లా నవ్వుకోపరా