పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0191-4 మంగళకౌాశిక సంపుటం: 07-540

పల్లవి:
పొంచి నే వారికినెల్లాబుద్ది చెప్పేను
యెంచరానిమాటాడేవారెవ్వరయ్య నిన్నును

చ.1:
చేరి నిన్నునాపెచూచి చిత్తములో గురి దాఁకె
సారెనిఁక మరేల విచారించేవు
చేరువ నేనున్నదాన చేతిలోనిదాననింతే
యీరసానఁ గాదనేవారెవ్వరయ్య నిన్నును

చ.2:
నవ్వేవారెల్లా నవ్విరి ననుపు నీకంతనాయ
నివ్వటిల్ల నీకు వట్టి నేమములేలా
మువ్వంక నీచేఁతలెల్ల మూసి దాఁచేదాననింతే
యివ్వలరట్టు సేసేవారెవ్వరయ్య నిన్నును

చ.3:
వూడిగము నేఁజేసితి వొద్దనున్నఁ గూడితివి
వేడుకతోనిందుకెంత వెరగందేవు
పాడితో శ్రీ వెంకటేశ పట్టపుదేవిని నేను
యీడఁ దప్పునవట్టేటి వారెవ్వరయ్య నిన్నును