పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0191-2 వరాళి సంపుటం: 07-538

పల్లవి:
కాదు గూడదననేల కక్కసించ నీతోనేల
సేదదేర నేర్చినట్టు సేవ సేసేను

చ.1:
ఆపెకు బుద్దులుచెప్పి అట్టెనాకు మొక్కించి
యేపుననున్నాఁడ విట్టె యెరఁగనట్టే
కోపగించుకొనరాదు కోరి నీతో నవ్వరాదు
వొపినపనిసేసి వొద్దనుండే నేను

చ.2:
కామినికి సన్నసేసి కానిక నాకిప్పించి
యేమియని అడిగేవు యెరఁగనట్టే
మోమోట విడువరాదున మొక్కలముసేయరాదు
గోమున నీకొలువులో కుంచ వేసే నేను

చ.3:
యింతిచే విడెమిప్పించి యెగ్గులెల్లాఁ దీర్చితివి
యెంతకెంత సేసితివి యెరఁగనట్టే
కాంతుఁడ శ్రీ వెంకటేశ కలసితివిటు నన్ను
పంతానకు నీకునేఁడు పాదాలొత్తే నేను