పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0191-11 శుద్దవసంతం సంపుటం: 07-537

పల్లవి:
కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు
వొరసేరింతులు పాదటూరిచెన్నరాయా

చ.1:
దగ్గరి కొలనిదరి తరుణులెల్లాంగూడి
సిగ్గులఁ జాఁచేరదివో చేతులు నీపై
వెగ్గళించి కన్నుల వెడనవ్వులు నవ్వుతా
వొగ్గీరు వలపు పాదటూరిచెన్నరాయా

చ.2:
తొల్లి నోఁచిననోములు తోడనిట్టే పలియించె
వల్లెగా నీపాందులకు వచ్చివున్నారు
చల్లలమ్మేమాటలనే సరసములాడేరు
వుల్లములలర పాదటూరిచెన్నరాయా

చ.3:
చీరలు నీవియ్యఁగాను చేకొని కాఁగలించిరి
మేరతో శ్రీ వెంకటాద్రిమీఁదనే నిన్ను
గారవించి యిందునందు కందువలు మెరసిరి
వూరటగా నీకుఁ బొదటూరిచెన్నరాయా