పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0190-5 నారణి సంపుటం: 07-535

పల్లవి:
గుణము దెలిసెనంటా గుబ్బున నున్నాఁడతఁడు
అని వెట్టి మమ్ము మాటలాడించేవే నీవు

చ.1:
చెక్కునఁ బెట్టినచేయి సిగ్గలే వడియఁజొచ్చె
యెక్కువపతిఁ జెనకేదెప్పుడే యిఁక
ముక్కునఁ బెట్టినవేలు ముసిముసి నవ్వులూరీ
మక్కళించి నీవాడే మాటలెప్పుడే

చ.2:
తప్పక చూచినచూపు తలపోఁతలే పెంచీ
కప్పురబాగాలిచ్చే గతులెప్పుడే
కప్పిన పయ్యదకొంగు కమ్మఁజెమటలుబ్బించీ
విప్పుచు మోవితేనెవిందులు వెట్టేదెవుడే

చ.3:
మంచముపై నున్నకేలు మర్మములెల్లా నెత్తిచ్చీ
నించిన రతులలోని నేరుపెప్పుడే
యెంచుక శ్రీవెంకటేశునింతలోనఁ గూడితివి
చుంచుల సరసముల సుద్దులెప్పుడే