పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0190-4 రామక్రియ సంపుటం: 07-534

పల్లవి:
చేకొనుమీ నల్లఁబల్లి చెన్నకేశవా
యీకడ నీ కిన్నిటికినిదవో మొక్కేను

చ.1:
పొంచి నీవు విలిచితే బొమ్మల జంకించితిని
మంచముపై నుండితిని మన్ననలను
కంచముపాత్తుకుఁ దియ్యఁగా నీతోఁ బెనఁగితి
యెంచకుమీ యీనేరాలిదివో మొక్కేను

చ.2:
సరసము నీవాడితే సారెసారెఁ దిట్టితిని
సిరులఁ జెనకితేనే చెలఁగితిని
శిరసు వంచుకొంటిని చెరఁగు నీవు వట్టితే
యెరవుసేయకు నన్నునిదివో మొక్కేను

చ.3:
సెలవి నీవు నవ్వితే సిగ్గులు పైఁజల్లితిని
సాలసి చెక్కు నొక్కితే చొక్కితి నేను
కలసితివిదె శ్రీవెంకటగిరినుండి వచ్చి
యెలమిఁ దమకించకు యిదివో మొక్కేను