పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0190-2 బౌళి సంపుటం: 07-532

పల్లవి:
వీడెమింద కోవయ్య వింతవారమా
వేడుకకు వెలలేదు వెరుపేల నీకు

చ.1:
కొండవంటిచెలి నిన్ను కొంగువట్టి తీసితేను
దండిమొగమోటమునఁ దగిలితివి
దుండగపువాఁడవా దోసము నీవల్లనేది
నిండినది తగవె పోనీకేల వెరపు

చ.2:
పొద్దువోనియాపె నీపై బొమ్మలమేలు చల్లితే
గద్దించఁజాలక నీవుగైకొంటివి
దిద్దరానివాఁడవా దీనికి వచ్చినదేది
కద్దు నీవొళ్ళ నిజము కాదున నీకు వెరపు

చ.3:
ఆయమెరిఁగినతి అంటితేఁ గడపలోన
పాయపువెంకటేశ పట్టి కూడితి
కాయకపువాఁడవా కైకొంటివి నన్నునిట్టే
నీయందుఁ గడమేది నీకేల వెరపు