పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0189-6 భైరవి సంపుటం: 07-530

పల్లవి:
వట్టి సిగ్గులిఁకనేల వద్దనున్నది
గట్టయాస నీపనులు కడపరాయ

చ.1:
ముంగిట నీకుపారము మోవితేనెలిటు చూపి
యెంగిలివలపుచల్లెనిదివో ఆకె
సింగారించుక చన్నులజిగి నీమొకముసేసి
అంగడివలపు చల్లెనదివో నీకు

చ.2:
కువాడానఁ జెప్పరాని గురుతు కన్నులఁ జెప్పి
నివాళివలపుచల్లె నీమీఁద నాకె
భవంతిమేడలో నిన్నుఁ బారితెంచి కాఁగలించి
దువాళివలపు చల్లె తొయ్యలి నీకు

చ.3:
పంతాన నీవు మెచ్చ వుపరిసురతముసేసి
దొంతవలపుచల్లె దొరసి యాపె
యింతలో శ్రీ వెంకటాద్రినెనసితివిటు నన్ను
బంతివలపులుచల్లె పయిపయి నీకు