పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0189-5 దేసాళం సంపుటం: 07-529

పల్లవి:
ఎందరికిని వుత్తరమిచ్చేవు నీవు
సందడించి వొక్కమాటె చల్లేరు సరసము

చ.1:
చెంతలనుండి నీవు సెలవుస నవ్వఁగాను
కాంత నీమొగముచూచి కన్నులార్చీని
వింతలు మీచేఁతలెల్లా వెలఁదులు చూచి తాము
దొంతిఁబెట్టి వలపులు తోడురేఁచుకొనిరి

చ.2:
పలుమారు నీమీఁదిపాటలు నీవు వాడఁగ
వెలఁది వీనుల విని వెరగందీని
కొలువువారెల్ల మీగురుతులు చూచి తాము
చలపట్టి అందరును చవిరేఁచుకొనిరి

చ.3:
శ్రీ వెంకటేశ రతికి చేతులు నీవు చాఁచఁగ
కావించి నిన్నునదిమీ కాంతచన్నుల
వోపరిలోనుండఁగాను వూడిగాలవారెల్ల
సేవలుచేసి మొక్కి చిమ్మిరేఁచుకొనిరి