పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0189-4 గౌళ సంపుటం: 07-528

పల్లవి:
ఇందవయ్య విడెము యేలకొంకేవు
సందుకొని మెచ్చేఁ గాక జంకించేనా

చ.1:
తాలిమిగలదొకతె తగ నీతోనలిగితే
యీలీల మోహించి నేమింతకోపేమా
నాలీక త్తెలమై నేము నవ్వనేర్తుముగాక
వీలుచును మొగమోట విడువఁగఁగలమా

చ.2:
గుట్టుచేసి వేరొక్కతె కొసరి నిన్నుఁ దిట్టితే
యిట్టె మన్ననలవారమింతకోపేమా
దట్టించి నీబాసలెల్లఁ దలఁపించనేర్తుఁ గాక
వెట్టుయైన నిష్టూరము వేయఁగనోపుదుమా

చ.3:
కూడేవేళ యెవ్వతైన గోరనిన్ను గీరితేను
యీడవెట్టుకొని నేము యింతకోపేమా
కూడితి శ్రవెంకటేశ గురుతులివేకాక
పాడిపంతములు నీతోఁ బచరించేమా