పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0189-2 ముఖారి సంపుటం: 07-526

పల్లవి:
కలికి చిలుకలకొలికి నీకునేము
చెలులముసంతోసము చేసితివే మాకు

చ.1:
అవ్వలిమోమైనవాని ఆయములు సోఁకనాడి
యివ్వల చేకొంటివిదివో నేర్చు
పవ్వళించి సతులపై పరాకై వుండినవేళ
నవ్వులు నవ్వించితివి నయగారివౌదువే

చ.2:
పంతములాడినవాని పానుపుమీఁదికి నేఁడు
యింతగా రప్పించుకొంటివిదివోనేర్పు
చెంతల నవ్వఁగా నన్నుచేరి జూాజమాడేవేళ
వింతరతికిఁ దీసితి వివరి వొదువే

చ.3:
సన్నలు సేసినవాని చాయఁ బైఁదీసుకొని
యెన్నిక చేకొంటివిదివో నేర్చు
అన్నిటా శ్రీ వెంకటేశుఁడాతఁడు చేకొన్నవేళ
మన్ననల మించితివి మంచిదానవౌదువే