పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0188-5 మంగళకౌాశిక సంపుటం: 07-524

పల్లవి:
నిజమై ఆతఁడు వచ్చి నిలుచున్నాఁడెదుటను
త్రిజగములును మెచ్చ దిష్టమాయం బనులు

చ.1:
లక్కవంటి నాచిత్తాన లచ్చనై ఆతనిరూపు
వొక్కటైవున్నదినేఁడు వొక్కటొక్కటే
యిక్కువ మామోముచూచి యేమినవ్వేరే చెలులు
చిక్కె మాకిద్దరికి మీచేసినట్టి పొాందులు

చ.2:
పూవువంటినాకోరిక పూఁపవంటాతనిమాట
తావుకొనివున్నవిలే తమలోనను
యీవల మాగుణాలకు నేమి మెచ్చేరే మీరు
దీవించి మీరిట్టె దిద్దిన దిద్దుబడులు

చ.3:
పాలవంటినాయాస పంచదారాతనిమోవి
తాలిమిఁగూడి వలపుదై వారీని
యీలోన శ్రీ వెంకటేశుఁడిచ్చగించి నన్నుఁగూడె
మేలనేరు యిదిమీరు మీసంతోసములే