పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0188-4 లలిత సంపుటం: 07-523

పల్లవి:
దానికేమి దోసమా తగులములెంచుకొని
తానకమై లోలోనే తప్పక మించితివి

చ.1:
యింతి నీతో బలిమా యెదురాడఁగలదా
చెంతల నీవుండఁగాను చెయి వట్టెను
పంతగాఁడవౌదువు పడఁతికంటాఁ దొల్లి
దొంతరలైతే వలపులు తోయరాకున్నాఁడవు

చ.2:
కోపమింకఁ దగునా కోమలి చలాలదా
కోపుల నీవు నవ్వఁగా గోరగీరెను
తీపులు నేరుతువు దిక్కులెల్లానెరుఁగును
పూఁపలు చన్నులుగాఁగా పొందులుసేసితివి

చ.3:
గుట్టు నీకుఁజేసునా గురుతులు వెట్టునా
యిట్టె నీవుగూడఁగాను యెనసెఁగాక
దిట్టువు నీవౌదువు తేఁకువ శ్రీ వెంకటేశ
పట్టిన వ్రతముగాఁగా ఫైకొని మెచ్చితివి