పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0188-11 సామంతం సంపుటం: 07-519

పల్లవి:
ఏమాయనే మీకునేలె చింత
యీమేరవలపులు యిమ్మడికి ముమ్మడి

చ.1:
నగవులే తగవులు నయములే ప్రియములు
జగడాలు మానినట్టి సతులకును

మిగిలి పతియున్నాఁడు మీయిద్దరినడుమను
జగతి మీవలపులు సరియె బేసి

చ.2:
మాటలే మూటలు మంతనాలే పొంతనాలు
కూటములెరిఁగినట్టి కోమలులకు
వాటముగా నిద్దరికి వరుసయిచ్చె విభుఁడు
మోట్టుపెట్టి వలపులు ముదియనాఁగాయను

చ.3:
కనుచూపులే తీపులు కరఁగులే మొరఁగులు
చనవులు గలిగిన సతులకును
యెనసె శ్రీ వెంకటేశుఁడిద్దరిని నొక్కమాటె
ననుపు వలపురెంటినడుము మెరసెను