పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0109-3 రామక్రియ సంపుటం: 07-051

పల్లవి:
ఇటమీఁద నాకు బుద్ధియేదే చెలియ నీవు
తటుకన నెఱిఁగించు తడవు సేయకువే

చ.1:
కంటివటె వానిని కాంతరో నేనన్న ట్టె
అంటివా యించుకించుక ఆయాలు సోఁక
వొంటినున్నాఁడో వేరేవొకరు వద్దనున్నారో
యింటికి నేనే వత్తునో యేమనేనే వాఁడు

చ.2:
తెచ్చితివా వానిని తివిరి నే నిమ్మన్నవి
యిచ్చితివా ముందుముందే యియ్యకొనెనా
వెచ్చపెట్టఁడు గదా వేడుకనెవ్వరికైనా
అచ్చలాన నేనాసుద్ది యడుగుదునా

చ.3:
నగితివా వానిని నా మనసులోనున్నట్టే
అగడుగా నా సంగడి నట్టె నిలిపి
పగటు శ్రీ వేంకటపతి నన్నునిదె కూడి
తగులాయ నన్నియును తారుకాణలాయెనే