పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0187-5 సామంతం సంపుటం: 07-517

పల్లవి:
పంచుక అనుభవించు పడఁతులమిందరము
ముంచి నీమన్నన నాపై మోహముగలంతే

చ.1:
మనసిచ్చి నాతోను మాటాడుటే పదివేలు
యెనయుమనుచు దూరనెంతదానను
చనవు నీదొకటే సతులు పదారువేలు
పెనఁగితే నెంతవచ్చు బెరసి నావంతు

చ.2:
యిచ్చగించి నాయెదుట నిరవవుటే పదివేలు
యెచ్చరించి కొసర నేనెంతదానను
అచ్చపు నీకాఁగిలిడే అతివలు శానాశాన
ఇచ్చితివి నావంతు యెంతవచ్చునందును

చ.3:
కందువ నీరతి నన్నుఁ గలయుటే పదివేలు
యిందరిలోఁ జెప్పేనంటే యంతదానను
విందుల శ్రీ వెంకటేశ విభుఁడవు నేమాండ్ల
మిందులో మించితి వంతుకెంత వచ్చునిపుడు