పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0187-4 శంకరాభరణం సంపుటం: 07-516

పల్లవి:
ఎందరు చుట్టాలు గల్లానింతకు మేలే
అందుకోలువలపులకంగవించేఁ గాక

చ.1:
బత్తిసేసీనాపె నీపై పరాకుసేయకువయ్య
చిత్తములోఁ గల మాటే చెప్పే నీకు
హత్తినేను వద్దనుండ యందుకింత సేయనేల
సత్తుగా నే వద్గనేలా సంతోషించేఁ గాక

చ.2:
ఇచ్చకముసేసీనాపె యేల వూరకున్నాఁడవు
చెచ్చెరఁ జేసేమాటే చెప్పే నీకు
ముచ్చట నేనెరిఁగితే మూసిదాఁచనింతయాల
మచ్చికలేమి గల్లాను మరిమెచ్చేఁ గాక

చ.3:
కలసిపెనఁగీనాపె కడమలేల పెట్టేవు
చెలిమికత్తెల సుద్ది చెప్పే నీకు
యెలమి శ్రీ వెంకటేశ యీడనున్నఁ గూడితివి
నలువంకమేకులకు నవ్వు నవ్వేఁ గాక