పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0187-3 నాదరామక్రియ సంపుటం; 07-515

పల్లవి:
నీతలనే వేగెనా నెట్టుకొన్న వలపులు
యేతుల సిగ్గువడకు యింటికాడిబేరము

చ.1:
చేసెనా అంగన నీకు చేసన్నలెల్లాను
వ్రాసెనా చెక్కుల గోరివాతలెల్లాను
మూసుకొనేవేమి నేఁడు మొగవాఁడవిందరిలో
దోసమా నీకందుకేమి తొలుసారిలాబము

చ.2:
నేరిపెనా ఆపెనీకు నిండుకొన్న విద్యలెల్లా
సారపుమోవితీపులు చవిచూపెనా
ఆరసియుఁ గొంకనేల అన్నిటా జాణవు నీకు
భారములేదించుకంతా బండవలము నీకు

చ.3:
కూడించె యాపె నీకు గురుతైన పొంతనాలు
వీడెమిచ్చెనా యిట్టే వెల్లవిరిగా
యీడనే శ్రీ వెంకటేశ యిటు నన్నునేలితివి
ఆడనీడానొక్కవెలే అంగడిలో సరకు