పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0187-2 సాళంగనాట సంపుటం: 07-514

పల్లవి:
ఆసోదకాఁడవు నీవు అయితే నౌదువుగాక
వేసటౌను కొసరితే వేవూరు వలెనా

చ.1:
మోవిపంటిలోననే మోహపురసాలు నించి
వేవేలు విందులువెట్టీ వెలఁది నీకు
యీవల మమ్మువిందులు యేలడిగేవప్పటిని
భావించితే మొగచాటు పైపైనే వలెనా

చ.2:
కడుమంచి చూపులనే కప్పురాలు నించి నించి
యెడయక విడేలిచ్చీ నింతి నీకు
వడి మా విడేలకే వరుఁసజేయిచాఁచేవు
విడువకైతే కారాలు వేగినంతా వలెనా

చ.3:
వింతవింతకాఁగిటను వియ్యమందెనాపె నీతో
చెంతల నవ్వులు నవ్వీ శ్రీవెంకటేశ
బంతి నన్నుఁ గూడితివి పచ్చిగాఁగ బుజ్జగించి
కాంతల చుట్టురికము కందువ గావలెనా