పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0186-6 గౌళ సంపుటం: 07-512

పల్లవి:
నేనే యింతసులభమా నీకెపుడు
ఆనుక సరిగాఁ జూడుమాతని నన్నిపుడు

చ.1:
ఆతనిమాటలకును అడ్డమాడఁగలనా
నీతాలే బోధించేవే నీవు మాతోను
చేతులువట్టుకొంటేనే చేఁతలెల్లా మరచేనా
యేతుల నాయకునికి యిట్టె విన్నవించవే

చ.2:
చిత్తమురా తనకును సేవసేయఁగలనా
వొత్తి నన్నింత యాల వొడివట్టేవే
బత్తిసేసినంతలోనే పంతము విడుతునా
హత్తిన రమణునికి ఆయములు దెలుపవే

చ.3:
శ్రీ వెంకటేశుతోడ సిగ్గువడఁగలనా
నీవిన్నియు నాకునేల నేరిపేవే
యీవేళ నన్నిటుగూడె యెప్పుడూ మఱతునా
చేవదేర నితనికి సెలవులు వెట్టువే