పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0186-5 భైరవి సంపుటం: 07-511

పల్లవి:
విన్నపములెల్ల నాచే విందువుగాక
సన్నలెల్ల సరివచ్చె జాగులిఁకనేలా

చ.1:
నగినట్టివాఁడవు నాలియిఁకఁ జేయకుమీ
చిగురుమోవిచవులఁ జిక్కుదుగాని
మొగమెదుటనుందాన మోహము నీలోనున్నది
అగడాయఁ బనులెల్లననుమానాలేలా

చ.2:
మాటలాడినవాఁడవు మరిగుట్టుసేయకుమీ
యీటుగా నీమనసెల్లనినిత్తువుగాని
పాటించి నీకు మొక్కితి భావము నీవెరుఁగుదు
కూటములు నెరవేరె కొంకుగొసరేలా

చ.3:
మెచ్చినట్టివాఁడవు మేకులిఁకఁ జేయకుమీ
అచ్చలాన యిక్కువలే అంటుదుగాని
యిచ్చగించి శ్రీ వెంకటేశ నన్నుఁ గూడితివి
లచ్చనలే గురుతాయ లాగవేగాలేలా