పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0186-4 దేసాక్షి సంపుటం: 07-510

పల్లవి:
ఏమిసేసు మరి యెక్కడ చొచ్చును
సామజవరదుని సహజమిదియ పో

చ.1:
ఏకతమాడెను యింతితోనతఁడు
దాకొని యిదేమి తప్పటవే
కైకొనవచ్చినఁ గన్నులఁ జూచెను
యేకడనితనికి యివి నేరములా

చ.2:
నవ్వులు నవ్వెను నలినాక్షితోడ
అవ్వలనిదేమి అన్యాయమా
రవ్వగ మొక్కిన రతిఁ జెయిచాఁచెను
చివ్వన నది సేసినదోసములా

చ.3:
గక్కనఁ గూడెను కలికి దగ్గరిన
వెక్కసమిదేమి వెలితౌనా
యెక్కువ శ్రీ వెంకటేశుఁడు గూడెను
మక్కువ నలమేల్‌మంగనౌదునే