పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0186-2 ముఖారి సంపుటం: 07-508

పల్లవి:
కూడితిమిందరము గుంపులాయ నీమోహము
వేడుకకు వెలలేదు వెరుపేల నీకు

చ.1;
సతమైన పనులకు చంచలము మరియాల
మతిలో నిర్మలమౌటే మంచిదౌఁగాక
గతి నీకునాపె నీవుగలిగితివాపెకును
వెతదీరెనందరికి వెరుపేల నీకు

చ.2:
చేసిన చేఁతలకును చింతించ మరియాల
ఆల భోగించుటే అందమౌఁగాక
సేస నీవు చల్లితివి చేతులు నీపైమోచె
వేసటెల్లాఁ బాసెనిఁక వెరుపేల నీకు

చ.3:
కలిగిన పనులకు కడమలు మరియాల
కొలముగా నిల్లునించుకొందువుగాక
యెలమి శ్రీ వెంకటేశ యిట్టె నన్నునేలితివి
వెలసె నీసుద్దులెల్లా వెరుపేల నీకు