పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఋఎకు: 0109-2 నాదరామక్రియ సంపుటం; 07-050

పల్లవి:
నీతలనే వేఁగెనా నిన్ను దూరఁ బనిలేదు
జాతిఁ బుల్లఁదీఁగెలకు సారెనలుగుదురు

చ.1:
తియ్యని మాటలెపో తెఱవ మోవినాడేది
కయ్యమడిచి వూరకే కారమనేవు
అయ్యరో నీవేకాదు ఆలినొల్లనివారు
వొయ్యనె యీలకూరకు వుప్పు చాలదందురు

చ.2:
చల్లని చూపులేపో సతికన్నులఁ జల్లేవి
వొల్లనివాఁడవై అవే వుడుకనేవు
మెల్లినె నీవేకాదు మేలుమేలు అంటే నీళ్ళు
బల్లిదులైనవారు పాటిగంపదెత్తురు

చ.3:
కూరిమి కౌఁగిలేకా కొమ్మనిన్నుఁ గూడినది
బీరాన నీవేమిటికో బిగువనేవు
యీరీతి శ్రీ వేంకటేశ యేకమైతివితరులు
మేరమీరేవారిఁగంటే మిక్కిలి లోనౌదురు