పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0186-11 శ్రీరాగం సంపుటం; 07-507

పల్లవి:
ఎట్టు వలపంచితివి యింతగా నన్ను
బట్టుబయటనే నీపంతమెల్లఁ జెల్లెను

చ.1:
తమకమే మీఁదమీఁద దైలువారుఁ గాని
ఆమరు నీరతిఁ దనివందదు మతి
తిమురుచు నీరపు దిష్టించి చూచీఁ గాని
తెమలి రెప్పముయ్యఫు తెల్లని నాకన్నులు

చ.2:
చేరి నితో మాటలకు సిగ్గులు వాపీఁ గాని
ఆరీతిఁ బొంది యలయవడియాసలు
మేరతో నీకాఁగిటికి మెరుఁగులెక్కీఁ గాని
బీరము మానవు నాబిరుదైన చన్నులు

చ.3:
కందువ నీకాఁగిటిలో కతలు నేరిపీఁ గాని
సందడినలయదు నాచల్లనిమేను
అంది శ్రీ వెంకటేశ నిన్నలమి మెచ్చీఁ గాని
గొందినొదుగదు నాకోరికతో గుణము